ప్రగతి కోసమే పాదయాత్ర..

కొల్లాపూర్ ప్రగతి కోసమే ఈ నెల 8వ తేదీ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు తెలిపారు.

Update: 2022-12-06 11:22 GMT

దిశ, వీపనగండ్ల: కొల్లాపూర్ ప్రగతి కోసమే ఈ నెల 8వ తేదీ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని తూంకుంట శివారులో పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో బీజేపీ అధికారంలో లేకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొల్లాపూర్ హైదరాబాద్ హైవే సోమశిల బ్రిడ్జి సాధించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని పరిశ్రమల ఏర్పాటు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటివి సాధించాల్సి ఉందని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి చెందలేదని ఇప్పటికీ పలు గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేదన్నారు, కొల్లాపూర్ ప్రగతి కోసం చేపట్టిన పాదయాత్రను నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు,

Similar News