రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు: డీజీపీ అంజనీకుమార్

నేరాల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో వివిధ సందర్భాలలో తీసుకుంటున్న చర్యలతో మన రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్లు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ తెలిపారు.

Update: 2023-01-25 16:42 GMT

దిశ, మహబూబ్ నగర్: నేరాల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో వివిధ సందర్భాలలో తీసుకుంటున్న చర్యలతో మన రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్లు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతి భద్రతలఫై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీస్ శాఖ చేసే కృషి ఆయా ప్రాంతాల అభివృద్ధికి కారణమవుతుందని ఆయన తెలిపారు. న్యాయ స్థానాలలో తగిన శిక్షల ఖరారుతో పాటు, పోలీసు కార్యాలయాల ఆధునీకరణను పూర్తి చేసుకోగలిగామని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు జిల్లాలో నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కాన్ఫరెన్స్ లో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేష్, ఆదినారాయణ, రమణారెడ్డి, మధు, లక్ష్మణ్, శ్రీనివాసులు, సీఐ తదితరులు పాల్గొన్నారు.

Similar News