నారాయణపేట జిల్లాలో భారీ దొంగతనం

మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వెనకాల ఉన్న కుర్వ రాములు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లిన గుర్తు తెలియని దుండగులు బీరువాలను తెరిచి అందులో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, 10 లక్షల నగదును దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-05-04 09:47 GMT

దిశ ,మహబూబ్నగర్ బ్యూరో /మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ లో శనివారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. గ్రామంలో బండారు పండగ జరుగుతున్న సందర్భంగా గౌడ పుల్ల రాములు అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు సంబంధించిన 40 తులాల బంగారం, ఇటీవల పశువుల అమ్మకం వల్ల వచ్చిన పది లక్షల రూపాయల నగదును బీరువాలో పెట్టారు. ఉక్క పోత కారణంగా అందరూ ఇంట్లో కాకుండా ఇల్లుకి తాళం వేసి వాకిట్లో నిద్రపోయారు.

అందరూ నిద్రలో ఉండగా దొంగలు వచ్చి తాళం చెవి తీసుకొని బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి తాళం తెరిచి బీరువా వద్దకు వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉండడం చూసి ఆందోళన చెంది పరిశీలించగా ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రించే ప్రయత్నాలు చేశారు. జాగిలాలు సంఘటన స్థలం నుంచి కల్లు దుకాణం వరకు వెళ్లి నిలిచిపోయాయి. తాళం చెవి ఎక్కడ ఉన్నదో చూసి దానితో తాళం తీసి.. దొంగతనం చేశారు అంటే.. అది తెలిసిన వ్యక్తుల పని అయి ఉంటుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై మురళి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News