మందు బాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు ?

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయ్యింది.

Update: 2022-03-06 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయ్యింది. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో మద్యం రేటు 20 శాతం వరకు పెంచింది ప్రభుత్వం. ఈ పెరిగిన ధరలతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందువలన మద్యంకు కాస్త డిమాండ్ కూడా తగ్గింది. దీంతో మద్యం, సప్లై పెంచే దిశగా ఆప్కారి శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. లిక్కర్ అమ్మాకాలు పెంచడానికి ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో బీర్ల అమ్మకాలు తగ్గడంతో.. ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించింది ప్రభుత్వం.  కానీ, లిక్కర్ బాటిల్‌పై ధర మాత్రం తగ్గించలేదు. అందువలన బీర్లు మినహా ఇండియా‌లో తయారయ్యే మద్యం పై స్వల్పంగా ధరలు తగ్గించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News