బీజేపీకి రాజీనామాపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

కర్ణాటకలో కాంగ్రెస్ విక్టరీతో తెలంగాణ చేరికలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం రోజు

Update: 2023-05-16 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ విక్టరీతో తెలంగాణ చేరికలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం రోజు రోజుకు బలపడుతోంది. ఈ నేపథ్యంలో తాను బీజేపీని వీడుతానని జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారే సమస్యే లేదని.. బీజేపీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు బరిలో బీజేపీ అభ్యర్థిగా తానే ఉండబోతున్నట్లు చెప్పారు. కొంతమంది తాను పార్టీ మారుతున్నట్లు పోస్టులు పెడుతూ క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌కు గురి చేయాలనే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News