స్వచ్ఛసర్వేక్షన్ పై శిక్షణ

భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ సీహెచ్. శ్రీకాంత్ స్వచ్ఛసర్వేక్షన్ పై శానిటేషన్ సిబ్బందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు.

Update: 2022-12-06 16:06 GMT

దిశ పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ సీహెచ్. శ్రీకాంత్ స్వచ్ఛసర్వేక్షన్ పై శానిటేషన్ సిబ్బందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది నిధులు నిర్వహిస్తున్న సమయంలో సేఫ్టీ పరికరాలు అయిన ఏప్రాన్లు, గ్లౌజులు, మాస్కులు ధరించాలని తెలిపారు. అలాగే ప్రతిరోజూ ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. 

Similar News