విప్పలమడకలో ట్రాక్టర్ ట్రక్ చోరీ

వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో ట్రాక్టర్ ట్రక్ చోరీకి గురైంది.

Update: 2024-03-26 08:37 GMT

దిశ, వైరా : వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో ట్రాక్టర్ ట్రక్ చోరీకి గురైంది. ఈ గ్రామంలోని రైతు దేవభక్తిని అర్జునరావుకు చెందిన ట్రాక్టర్ ట్రక్కును గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ గ్రామంలోని సోమలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన మంచినీటి ట్యాంకుల సమీపంలో తన వియ్యంకుడు యడ్లపల్లి నాగేశ్వరరావు కు చెందిన స్థలంలో

    ఈనెల 22వ తేదీన అర్జున్ రావు తన ట్రాక్టర్ ట్రక్కును పార్కింగ్ చేశారు. అయితే మంగళవారం పార్కింగ్ చేసిన స్థలంలో ట్రాక్టర్ ట్రక్ లేకపోవడంతో చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు. గ్రామంలోని ట్రాక్టర్ యజమానులతో పాటు గ్రామస్తులను వాకబ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితుడు అర్జునరావు వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ట్రాక్టర్ ట్రక్ విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని అంచనా. 

Similar News