ఈ నీరే వారికి హిమాలయ వాటర్​

మీరు పైన చూస్తున్న నీరే వారికి హిమాలయ వాటర్​. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

Update: 2024-05-01 12:51 GMT

దిశ,తల్లాడ : మీరు పైన చూస్తున్న నీరే వారికి హిమాలయ వాటర్​. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలపేట గ్రామంలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల పర్యవేక్షణ ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పడంతో వారు పట్టించుకోకపోవడంతో ప్రజలకు కనీసం తాగునీరు

    లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాలపేట ఎస్సీ కాలనీలో దాదాపు 50 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. అక్కడ మంచినీటి వినియోగానికి ఒక్క చేతిపంపు మాత్రమే ఉండగా అది కూడా ప్లాట్ ఫామ్ అంతా శిథిలమైపోయి మురుగు నీరు అంతా మళ్లీ అదే బోరులో కలిసి పోతున్నాయి. ఈ నీటినే తాగటం వలన ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

Similar News