విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : ఆర్టీఏ కమిషనర్‌ శంకర్‌ నాయక్‌

విద్యార్ధి దశ నుండి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దానికి అనుగుణంగా నభ్యసించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ డాక్టర్‌ గుగులోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.

Update: 2022-12-06 17:10 GMT

దిశ, కారేపల్లి : విద్యార్ధి దశ నుండి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దానికి అనుగుణంగా నభ్యసించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ డాక్టర్‌ గుగులోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. కారేపల్లి మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఆయనకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో జరిగిన అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్ఫించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్టీఐ కమిషనర్‌ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అసమానతలను ఎత్తి చూపుతూ అంబేద్కర్‌ నిర్ధేశించిన లక్ష్యాలను సాధించటానికి యువత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి మండలం తహసీల్ధార్‌ కె.లక్ష్మి, ఆర్‌ఎల్సీ అరుణ కుమారి, ప్రిన్సిపాల్‌ ఎం.శైలజ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News