చింతపల్లిలో సేదతీరిన సైబీరియన్​కొంగలు.. బెదిరిస్తున్న కోతులు

అనవాయితీగా వస్తున్న సైబీరియన్ కొంగలు(చింతపల్లి చుట్టాలు) ఈ ఏడాది కూడా...Special Story

Update: 2023-01-24 14:26 GMT

దిశ, ఖమ్మం రూరల్: అనవాయితీగా వస్తున్న సైబీరియన్ కొంగలు(చింతపల్లి చుట్టాలు) ఈ ఏడాది కూడా ఖమ్మం రూరల్​మండలం చితంపల్లి గ్రామంలో సేదతీరాయి. ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో వచ్చే ఈ కొంగలకు ఈసారి గ్రామంలో కొతుల బెడద ఉండటం వలన అవి చెట్ల మీద వాలేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. కోతులను నిలువరివంచి కొంగలకు రక్షణ కల్పించాల్సిన ఫారెస్ట్, టూరిజం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ కొంగలు వస్తే వర్షాలు సమృద్ధిగా పడుతాయని సెంటిమెంట్ గా భావించే గ్రామస్తులు కోతులు పక్షులకు కల్పిస్తున్న ఆటంకాలకు ఆందోళన చెందుతున్నారు.

Similar News