జాతీయస్థాయి ఎడ్ల పందాలు, మహిళ ప్రో కబడ్డీ పోటీలు ప్రారంభం

సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా జీళ్లచెరువు గ్రామంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటూరీ శేఖర్ యువసేన నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, జాతీయ స్థాయి మహిళ ప్రో కబడ్డీ పోటీలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ప్రారంభించారు.

Update: 2023-03-30 14:50 GMT

దిశ, కూసుమంచి : సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా జీళ్లచెరువు గ్రామంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటూరీ శేఖర్ యువసేన నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, జాతీయ స్థాయి మహిళ ప్రో కబడ్డీ పోటీలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇరువురు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ముందుగా కబడ్డీ పోటీలో ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్ మహిళ కబడ్డీ జట్లు తలపడ్డాయి. ఎడ్ల బలప్రదర్శన మొదటి దఫాలో సూర్యాపేట జిల్లా చింతలపాలెం కు చెందిన ఒంగోలు జాతి ఎడ్లు పోటీలో దిగాయి.

    ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఈ సారి ఎడ్ల బల ప్రదర్శనను ఫెడ్ లైట్ కాంతులతో నిర్వహిస్తున్నారు. ఈ బల ప్రదర్శన తిలకించెందుకు పలు గ్రామాల నుంచి 10వేల మంది తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, ఆత్మ కమిటీ చైర్మన్ రామ సహాయం బాలకృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమా శ్రీనివాస్, నెలకొండపల్లి మండల అధ్యక్షుడు ఉన్నాం బ్రాహ్మయ్య, మళ్ళీడు వెంకన్న, కిరణపాలెం ఎంపీపీ బోడా మంగిలాల్ పాల్గొన్నారు.

Similar News