భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

మండలంలోని పీవీ కాలనీ సీఎస్ఐ ఎస్టీ పాల్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.

Update: 2024-03-29 10:12 GMT

దిశ,మణుగూరు : మండలంలోని పీవీ కాలనీ సీఎస్ఐ ఎస్టీ పాల్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. క్రైస్తవులు క్రీస్తు మరణాన్ని స్మరించుకుంటూ 40 రోజులుగా అనేకమంది చేస్తున్న ఉపవాస దీక్షలు గురువారంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు క్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలో ప్రార్థనలతో గంటలు మోగించారు. ఈ సందర్భం గా సీఎస్ఐ ఎస్టీ పాల్ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎన్ వీ రత్నం మాట్లాడుతూ...మానవాళి కోసం ఏసుప్రభు చేసిన కృషి,

    త్యాగాలను క్రైస్తవ సోదరులకు వివరించారు. క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు క్రైస్తవ మార్గంలో నడుస్తున్న వారికి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సత్య మార్గాన్ని అలవర్చుకోవలన్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మనిషి చనిపోయేంతవరకు ఏసుప్రభువు బోధనలను స్మరించుకుంటూ సమాజానికి, ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి కార్యదర్శి గుర్రం రాజ్ కుమార్, కోశాధికారి రామాల వినోద్ బాబు, కమిటీ సభ్యులు మైసా వినోద్ కుమార్, సాత్రి కమలాకర్, తాండ్ర కుమార్, జ్యోతి, సుజాత, రత్నకుమారి, శోభా రాణి సంఘం సభ్యులు పాల్గొన్నారు. 

Similar News