అబద్దాల కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని, మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మోసపు మాటలు చెప్పేందుకు వచ్చారని, వారిని నిలదీయాలని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు.

Update: 2024-05-01 10:58 GMT

దిశ,ఎర్రుపాలెం : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని, మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మోసపు మాటలు చెప్పేందుకు వచ్చారని, వారిని నిలదీయాలని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఎర్రుపాలెంలో బుధవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మార్పీఎస్, జనసేన నాయకులతో కలిసి తాండ్ర ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా తాండ్ర వినోద్​రావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పలువురు నేతలు తెలిపారు. రోడ్ షో సందర్భంగా నిర్వహించిన సభలో పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడారు. మండుటెండలో సైతం మహిళలు, వృద్ధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కృతజ్ఞతలు చెప్పారు.

     ప్రజలను నీడలో పెట్టి ఎండలో కష్టపడేవాడు నిజమైన నాయకుడని, నరేంద్ర మోడీ ఎండనక, వాననక ఢిల్లీలో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉన్నామంటే నరేంద్ర మోడీ మతసామరస్యం, దేశ సరిహద్దు భద్రత కోసం కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం ఏం పాపం చేసిందని 10 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకో లేదన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగం ఇతర ఉపాధి అవకాశాలు కూడా లేవన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అయిపోయి, రిజర్వేషన్ రద్దని కొత్త డ్రామాకు తెరలేపి దొంగ వీడియోలు తయారు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ఉచిత రేషన్ బియ్యం అందజేసింది మోడీ ప్రభుత్వమే అని తెలిపారు. తనను ఢిల్లీకి ఎంపీగా పంపిస్తే ఖమ్మం సమగ్ర అభివృద్ధికి పాటుపడతానన్నారు. కమలం పువ్వుకు గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ మోడీ ప్రధాని కావాలంటే ఇక్కడ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని అనేక పార్టీలు మోసం చేశాయని, బీజేపీ మాత్రం మోడీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి వర్గీకరణ దిశగా

    అడుగులు వేస్తుందని, అందుకే పార్టీకి ఎటువంటి షరతులు లేకుండా మద్దతిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలవేళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ రద్దు అనే అంశం ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మధిర నియోజకవర్గం కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు, అసెంబ్లీ ఇంచార్జ్ దేవరకొండ కోటేశ్వరరావు, మండల అధ్యక్షుడు నూతక్కి నరసింహారావు, మధిర మండల అధ్యక్షుడు బాపట్ల రమేష్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ గరిడేపల్లి వేణు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు విజయ రాజు, జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, కిసాన్ సెల్ నేత పుప్పాళ్ల చంద్రమౌళి, అధికార ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మాచర్ల క్రాంతి, నియోజకవర్గ ఇన్చార్జి కోట హనుమంతు, కార్యదర్శి తాటికొండ రామారావు, జిల్లా కార్యదర్శి బలవంతపు నరసింహారావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేకల వరయ్య, రామకృష్ణ, శివమణిరెడ్డి, కొండూరి రాజేష్ , గట్టి కొండ కిషోర్, మందా అశోక్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

Similar News