ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

విద్యుత్ స్తంభం శిథిలమై ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-02-03 11:18 GMT

పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

దిశ, కూసుమంచి: విద్యుత్ స్తంభం శిథిలమై ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో ఎస్ స్మార్ట్ సమీపంలో గత కొన్ని రోజులుగా కరెంట్ స్తంభం శిథిలమై ఉంది. సమస్యను సంబంధిత శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో జనం అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారు. ఆ స్తంభం ఖమ్మం - సూర్యాపేట ప్రధాన రహదారిలో మార్గంలో ఉండటం ప్రతి నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విరిగిన స్తంభం పై 11కేవీ లైన్‌ ఉండడంతో వెంటనే సరిచేయకపోతే ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి శిథిలమైన స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News