ఖమ్మం మీద మోడీ ప్రత్యేక దృష్టి

తెలంగాణలో గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఖమ్మం మీద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, వారి ద్వారా ఇక్కడి అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఈ గడ్డ బిడ్డగా కృషిచేస్తానని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు.

Update: 2024-04-27 14:05 GMT

దిశ బ్యూరో, ఖమ్మం : తెలంగాణలో గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఖమ్మం మీద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, వారి ద్వారా ఇక్కడి అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఈ గడ్డ బిడ్డగా కృషిచేస్తానని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఖమ్మంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్ షో లో మాట్లాడుతూ తాను నామినేషన్ పేపర్లు సమర్పించిన రోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ఖమ్మం పంపారని, 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కొత్తగూడెం పంపుతున్నారని, ప్రజల దీవెనలు ఉంటే స్వయంగా మోడీనే వస్తారని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. యావత్ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే

    ఇక్కడ సరైన ఎంపీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఒక్క ఫ్యాక్టరీ గానీ, చెప్పుకోదగ్గ విద్యా సంస్థ గానీ, వైద్యశాల గానీ రాలేదని ఆయన అన్నారు. ఈ గడ్డ బిడ్డగా ఇక్కడి సమస్యలు తెలులని, బైటి నుంచి వచ్చిన వాళ్లకు మన ఇబ్బందులు ఏమి తెలుస్తాయి? నాకో అవకాశం ఇస్తే అభివృద్ధి పథంలో ఖమ్మాన్ని చేరుస్తానని అన్నారు. పిండి లేకపోయినా రొట్టెలు చేస్తానని కాంగ్రెస్ ఎచ్చులు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గాల్లో కలిసిపోయాయని చెప్పారు. ట్రీ టౌన్ అధ్యక్షుడు కె.లక్ష్మీనారాయణ, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల వీరభద్రం, జంగిలి రమణ, అంకతి పాపారావు, రవీందర్, పమ్మి అనిత, శాసనాల సాయిరాం, బీకం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే బీసీలకు న్యాయం

దేశంలో బీజేపీతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని వినోద్ రావు ఉదయం బీసీ సన్నాహక సమ్మేళనంలో చెప్పారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వీరు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనంలో మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం పురోగమనంలో ఉంటే, వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ వస్తే ఆయన రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ పేదరికం, వివక్ష పోవడానికి కృషిచేస్తున్న మోడీని గెలిపించడం ప్రజల సామాజిక, నైతిక బాధ్యత అన్నారు. ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్, భాను ప్రకాష్, రేఖ సత్యనారాయణ, జ్వాలా నరసింహారావు, రుద్ర మాధవ్, బోయినపల్లి చంద్రశేఖర్, సుధాకర్, అల్లిక అంజయ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Similar News