హైదరాబాద్‌కు చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ ‌మాన్.. కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ

హైదరాబాద్ చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.

Update: 2023-05-27 08:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ఇరువురు ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడనుంచి కాసేపట్లో ప్రగతిభవన‌కు వెళ్లనున్నారు. కేసీఆర్‌ను కలిసి జాతీయ రాజకీయాలు, కేంద్రం అనుసరిస్తోన్న విధానాలపై చర్చించనున్నారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే శరద్ పవార్ సహా విపక్ష నేతలను కలిసిన ఢిల్లీ సీఎం ఇప్పుడు తాజాగా కేసీఆర్‌ను కలవనున్నారు. కేజ్రివాల్ ఇలా విపక్ష నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.

నీతి ఆయోగ్‌ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా మరో ఆరుగురు విపక్ష సీఎంలు బహిష్కరించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ నీతి ఆయోగ్‌ భేటీకి గైర్హాజరయ్యారు. ఢిల్లీ సీఎం నీతి అయోగ్ సమావేశాలకు గైర్హాజరయి మరోపక్క తెలంగాణ సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమయింది.

Read more:

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!

దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News