ఫలించని చర్చలు.. కే.కేశవరావుపై మాజీ సీఎం కేసీఆర్ సీరియస్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు భేటీ ముగిసింది. పార్టీ మార్పు వార్తలు విస్తృతం కావడంతో గురువారం కేకేతో‌ పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీని ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడారు.

Update: 2024-03-28 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు భేటీ ముగిసింది. పార్టీ మార్పు వార్తలు విస్తృతం కావడంతో గురువారం కేకేతో‌ పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీని ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడారు. అయితే, కేకేతో కేసీఆర్ జరిపిన చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతానని స్పష్టంగా కేసీఆర్‌తో కేకే చెప్పినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడుతానంటే ప్రజలు గమనిస్తారని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో కేకేకు ఏం తక్కువ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘మీ ఆలోచన తప్పు.. మీరే ఆలోచించుకోండి’ అని కేకేతో కేసీఆర్ చెప్పారు.

Tags:    

Similar News