Karimnagar Floods : భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా అతలాకుతలం.. ఫోటో ఫీచర్

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం అవుతుంది.

Update: 2023-07-27 10:39 GMT

దిశ, నెట్ వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం అవుతుంది. జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు, నదులు ఎక్కడికక్కడ పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ వృక్షాలు, కరెంటు స్తంబాలు నేలమట్టం అవుతున్నాయి. రోడ్లపై వరదనీరు భారీగా చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులకు వరద పోటెత్తడంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలో ఉండిపోయాయి. అలాగే భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు మునిగిపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ వరద సృష్టిస్తోన్న భీబత్స దృష్యాలను 'దిశ ' మీ ముందు ఉంచుతోంది.














 




 






 




Read More :   భాగ్యనగరం...వరద మయం

Tags:    

Similar News