బ్రేకింగ్ న్యూస్.. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు.. 14,190 మంది అమ్మాయిలకు విముక్తి

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి యువతులను రప్పించి హైదరాబాద్ లో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

Update: 2022-12-06 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్:హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి యువతులను రప్పించి హైదరాబాద్ లో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ముంబయితో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్ థాయిలాండ్, రష్యా దేశాలకు చెందిన యువతులకు ఉద్యోగాలు, ఉపాధి పేరుతో వల వేసి ఇక్కడికి రప్పిస్తున్నారు. ఆపై వారిని చీకటి కూపంలో దించుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠాకు సంబంధించిన 17 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ముఠా ఆగడాల నుంచి 14190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ముఠా సభ్యులు మరో 39 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సెక్స్ రాకెట్ అంతా ఆర్గనైజింగ్ జరుగుతోందని ఇందు కోసం పలు వెబ్ సైట్లు, వాట్సాప్ గ్రూప్ ల ద్వారా హైటెక్ లెవల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించామని, అలాగే విటులతో కాంటాక్ట్ అయ్యేలా ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేసుకున్నట్టు స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వ్యభిచారంతో పాటు యువతుల ద్వారా డ్రగ్స్ సరఫర కూడా చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు

Similar News