రమణ భూపతికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ 2023 పురస్కారం అవార్డు..

ఐటీ రంగంలో 15 ఏళ్లుగా విశేష సేవలను అందిస్తూ.. సామాజిక సేవలోనూ ముందంజలో నిలుస్తున్న క్వాలిటీ థాట్ ఫౌండర్ చైర్మన్ రమణ భూపతికి అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికిగానూ స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం వరించింది.

Update: 2023-01-29 16:08 GMT

దిశ, శేరిలింగంపల్లి: ఐటీ రంగంలో 15 ఏళ్లుగా విశేష సేవలను అందిస్తూ.. సామాజిక సేవలోనూ ముందంజలో నిలుస్తున్న క్వాలిటీ థాట్ ఫౌండర్ చైర్మన్ రమణ భూపతికి అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికిగానూ స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం వరించింది.విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఈ అవార్డును అందజేసింది. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా రమణ భూపతి పురస్కారాన్ని అందుకున్నారు.

సాఫ్ట్ వేర్ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దిడంతో పాటు వారికి ప్లేస్ మెంట్స్ చూపించడంలో రమణ భూపతి చేస్తున్న కృషిని లక్ష్మీనారాయణ ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆయన మార్గదర్శిగా నిలుస్తున్నారని కొనియాడారు. రమణ భూపతి భవిష్యత్ లో కూడా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో ముందుండాలని, మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. 

Similar News