స్క్రాప్ దుకాణంలో పేలిన సిలిండర్.. భారీగా చెలరేగిన మంటలు
హైదరాబాదులోని కూకట్పల్లిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాదులోని కూకట్పల్లిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సాయిబాబానగర్లో ఓ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులో ఉన్న ఓ సిలిండర్ పేలి స్క్రాప్ గోదాం దగ్ధమైంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు వెంటనే భయంతో పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్క్రాప్ దుకాణంలో పేలిన సిలిండర్.. భారీగా చెలరేగిన మంటలు
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2024
హైదరాబాద్ - కూకట్ పల్లి సాయిబాబా నగర్ లోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులో ఉన్న ఓ సిలిండర్ పేలి స్క్రాప్ గోదాం దగ్ధమైంది.
గమనించిన స్థానికులు… pic.twitter.com/tDbIvnMscJ