మంచు విష్ణు రాగానే ఆమెను ‘మా’లోంచి తొలగిస్తాం: నటి

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన అనేకమంది నటీనటులు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.

Update: 2024-05-23 11:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన అనేకమంది నటీనటులు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు. తాజాగా.. ఈ కేసుపై ప్రముఖ నటి కరాటే కల్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు నమోదు కావడం బాధాకరం అన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన హేమ ‘మా అసోసియేషన్’ సభ్యత్వాన్ని తొలగిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫ్రాన్స్‌లో ఉన్నారని అన్నారు. కెన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో కన్నప్ప చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారని చెప్పారు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. కాగా, ఈ రేవ్ పార్టీ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో జరిగిన విషయం తెలిసిందే. పార్టీలో డ్రగ్స్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు లభ్యమవ్వగా.. పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా హాజరైనట్లుగా తేల్చారు. అది కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే వీరిలో అత్యధికంగా ఉన్నారట.

Tags:    

Similar News