Agrigold scam case: వేగం పెంచిన ఈడీ.. ఆ ముగ్గురి పేర్లతో ఛార్జిషీట్‌

అగ్రిగోల్డ్ స్కాం కేసు విచారణలో ఈడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. .

Update: 2023-09-06 11:11 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ స్కాం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ, 6,380 కోట్లు వసూలు మోసాలకు పాల్పడినట్లు ఆ సంస్థపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు సుమారు రూ. 4,141 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. 

తాజాగా ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు వేగం పెంచారు. అగ్రి గోల్డ్ సంస్థ చేసిన మోసంపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, హేమ సుందర వరప్రసాద్, శేషునారాయణ రావు పేర్లను ఛార్జి‌షీట్‌లో నమోదు చేశారు. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుంబంధ సంస్థలపై ఈడీ అధికారులు నాంపల్లి ఎంఎస్జే కోర్టులో ఛార్జిషీటు వేశారు. ఈ చార్జిషీట్‌ను ధర్మాసనం స్వీకరించింది. వచ్చే నెల 3న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, ఆ కంపనీ ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. 

Tags:    

Similar News