Holi viral video.. స్కూటీపై ‘హోలీ’ రొమాన్స్ జంట అరెస్ట్

నెట్టింట ఫేమస్ అవ్వడం కోసం యువత కొన్ని చోట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా స్కూటీపై రొమాన్స్ చేస్తూ రీల్ చేసిన అమ్మాయిలకు ఇటీవల పోలీసులు ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-03-28 13:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నెట్టింట ఫేమస్ అవ్వడం కోసం యువత కొన్ని చోట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా స్కూటీపై రొమాన్స్ చేస్తూ రీల్ చేసిన అమ్మాయిలకు ఇటీవల పోలీసులు ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో ఒక అబ్బాయి స్కూటీ నడుపుతుండగా.. ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చోని రంగులు పూసుకుంటూ రొమాన్స్ చేశారు. మరో వీడియోలో రోడ్డుపై కూర్చోని రంగులు పూసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో.. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ స్కూటీపై 33 వేల భారీ జరిమానా విధించారు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఢిల్లీ, నోయిడా వీధుల్లో అసభ్యకరమైన ప్రవర్తించారని వినీత, ప్రీతి, పీయూష్‌లను ఐపీసీ సెక్షన్లు- 279, 290, 294, 336, 337 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతని స్కూటీపై మొత్తం 80,000 చలాన్ జారీ చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News