భూ కుంభకోణం ఆరోపణలపై హైకోర్టు సీరియస్.. అధికారులు, రాజకీయ నేతలకు నోటీసులు జారీ

Update: 2023-03-08 15:09 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: సంగారెడ్డి అన్నారం గ్రామ.. భారీ భూ కుంభకోణం ఆరోపణల మీద హైకోర్టు సీరియస్​అయ్యింది. సర్వే నెంబర్​లోని 588 ఎకరాల భూ అక్రమ లావాదేవీలు, అక్రమ లే ఔట్ల పై సమగ్ర వివరణ ఇవ్వాల్సిందిగా సూచించింది. ఇరవై ఏడు మంది రెవెన్యూ, పంచాయతీ అధికారులతోపాటు రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసింది. భూ అక్రమ లావాదేవీలపై రిట్ ​పిటిషన్​ ఎందుకు స్వీకరించరాదో మార్చి 27వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని పంచాయతీ రాజ్​శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్​కు నోటీసులు ఇచ్చింది.

వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, పేదల పట్టా భూములు, రిటైర్డ్​మిలటరీ ఉద్యోగులకు సంబంధించిన భూముల అన్యాక్రాంతం.. అందులో అధికారుల పాత్ర పై పలు అనుమానాలను వ్యక్తం చేసింది. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూడటం పై విస్మయం వ్యక్తం చేసింది. పంచాయతీ నిధులు వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి చెక్కుల ద్వారా బదిలీ చేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్దంగా ప్లాన్ ప్రకారం నిధులను దుర్వినియోగం చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News