బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షం!

నగరంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భగభగ మండుతున్న సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు.

Update: 2023-05-28 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భగభగ మండుతున్న సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలి వీచింది. ఆ కాసేపటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు.

Tags:    

Similar News