పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో అన్నీ అబద్ధాలే.. హరీష్ రావు సీరియస్

తెలంగాణ ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2024-02-17 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజెంటేషన్‌లో సత్యదూరమైన విషయాలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. రూ.775 కోట్లు కేటాయించి మిడ్ మానేరు, ఎల్లంపల్లి తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లేందుకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. అంతకుముందు సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇందు కోసం ఓ టెక్నీషియన్ సభలోకి వచ్చాడు. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావొద్దని.. టెక్నీషియన్‌ను సభలోకి అనుమతించవద్దని.. మంత్రి మాత్రమే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్‌ను కోరారు.

Tags:    

Similar News