KTR ఎఫెక్ట్.. మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్..!

రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా

Update: 2024-04-26 13:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 1వ తేదీన వరంగల్‌లో మాట్లాడిన కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ కంప్లైంట్ మేరకు సురేఖ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని ఈసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 


Similar News