భాగ్యలక్ష్మీ అమ్మవారిపై ప్రమాణం చేసిన రేవంత్.. ఈటల రియాక్షన్ ఇదే..!

మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ముట్టాయని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-04-22 13:04 GMT

దిశ, వెబ్ డెస్క్: మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ముట్టాయని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈటల వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ వద్ద తడిబట్టలతో ప్రమాణం చేద్దాం.. దమ్ముంటే రా’’ అంటూ ఈటలకు సవాలు విసిరారు. అన్నట్లుగానే రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో భారీ కాన్వాయ్ నడుమ చార్మినార్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ కి చేరుకున్నారు.

అనంతరం మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి నుంచి డబ్బు తీసుకోలేదని అమ్మవారిపై ప్రమాణం చేశారు. కాగా రేవంత్ సవాలుకు ఈటల రాజేందర్ తన నివాసం నుంచే సమాధానం ఇచ్చారు. ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. తాను వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం అలా మాట్లాడానని అన్నారు. ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. కాగా ఈటల రాజేందర్ ఆరోపణలను నిరసిస్తూ ఉస్మానియా పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News