తెలంగాణ రాజకీయాలపై ప్రధాని అభిప్రాయం.. ఈసారి అంత టైమ్ పట్టదని షాకింగ్ కామెంట్స్

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది.

Update: 2024-05-05 04:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ దిశగా ప్రయత్నాలు సైతం మొదలు పెట్టింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సౌత్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. గెలుపు గుర్రాలను బరిలో పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను అధికారం నుంచి దించేయడానికి పదేళ్లు సమయం తీసుకున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ విషయంలో అలా ఉండబోదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రెండూ అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలోనూ అవి భాగస్వాములుగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు ఎప్పటికీ పేదల గురించి, పాలన గురించి ఆలోచించవని అన్నారు. అందుకే ఎన్నికల్లో ఆచితూచి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.

Tags:    

Similar News