కేసీఆర్ సూచన మేరకే అక్రమ కేసులు.. Bandi Sanjay సీరియస్

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై సమాధానం చెప్పాలని సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Update: 2022-08-23 07:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై సమాధానం చెప్పాలని సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, సోమవారం రాత్రి బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు(హత్యాచారయత్నం) పెట్టి పలు సెక్షన్లు నమోదు చేశారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా బీజేపీ స్టేట్ ఛీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలపై టీఎస్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడి చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం నిరసనకు అనుమతినిస్తుంది. కానీ, బీజేపీ నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టడం ముఖ్యమంత్రి కార్యాలయ సూచనల ఆధారంగా జరిగిందని ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు చికిత్స కూడా అందించకుండా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచడం అత్యంత దారుణం అన్నారు. గాయపడిన బీజేపీ నేతలను వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసు కేసులు, టీఆర్‌ఎస్‌ గూండాల దాడులకు బీజేపీ భయపడదన్నారు. మద్యం కుంభకోణంలో నిజానిజాలు బయటపెట్టాలని.. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా, తెలంగాణ బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్ఎస్ గూండాలు జరిపిన దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News