చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతూ చిల్ అవుతున్న అసదుద్దీన్ ఓవైసీ! (వీడియో వైరల్)

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చిన్నారులతో క్రికెట్ ఆడుతూ చిల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2024-05-12 13:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చిన్నారులతో క్రికెట్ ఆడుతూ చిల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ చిన్నారులతో కలిసి రోడ్ పై గల్లీ క్రికెట్ ఆడారు. చిన్నారులు బౌలింగ్ వేస్తుండగా ఆయన బ్యాట్ పట్టుకొని షాట్ లు కొట్టారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇన్ని రోజులు కష్టపడ్డ అసదుద్దీన్ ఓవైసీ గల్లీలోని చిన్న పిల్లలతో ఆటలు ఆడుతూ చిల్ మూడ్ లోకి వెళ్లినట్లు కనిపించారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారాలు ముగియడంతో నేతలు సరదా కార్యక్రమాలతో చిల్ అవుతున్నారు. ఇవ్వాళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్ధులతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడగా.. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా గడిపిన నేతలు.. ఎన్నికలకు ఒక రోజు మాత్రమే ఉన్న ఈ తరుణంలో ఆటలు ఆడుతూ కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గెలుస్తామనే ధీమాతో ఆటలు ఆడుతున్నారా? లేక ఇన్నాళ్ల శ్రమను మర్చిపోయేందుకు సరదాగా గడుపుతున్నారా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Similar News