సారూ...మిమ్మల్ని యాది మరిచారు....

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రూ.కోట్లు ఖర్చు చేసి సంబరంగా జరుపుకుంటున్న బీఆర్​ఎస్​తో పాటు ఇతర పార్టీల నేతలు జయశంకర్​సార్​ను మరిచారు.

Update: 2023-06-02 11:16 GMT

దిశ, గుడిహత్నూర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రూ.కోట్లు ఖర్చు చేసి సంబరాలు జరుపుకుంటున్న బీఆర్​ఎస్​తో పాటు ఇతర పార్టీల నేతలు జయశంకర్​సార్​ను మరిచారు. వేడుకల్లో గాంధీ, అంబేద్కర్​తో పాటు ఇతర మహనీయుల చిత్ర పటాలను ఉంచి పూజలు చేసి వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పాటుకు దిశనిర్దేశం చేసిన జయశంకర్​సార్​ను మాత్రం ఎవ్వరూ గుర్తుంచుకోలేదు.

    ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. మలిదశ ఉద్యమానికి ఆయన దిక్సూచీలా వ్యవహరించారు. కీసీఆర్​ కూడా ఆయన సలహా లేనిదే ఏపనీ చేయలేదు. కానీ నేడు రాష్ర్టం సిద్దించి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో మాత్రం ఎక్కడా ఆయన ఫొటో కనిపించకపోవడం దారుణం. ఆయన విగ్రహానికి కూడా ఎవ్వరూ కనీసం పూలమాల కూడా వేసిన దాఖలాలు లేకపోవడం శోచనీయం.

గుడిహత్నూర్ మండలంలో కూడా....

మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో పాఠశాలలో జాతీయ జెండాను ఎగరేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటాన్ని పెట్టకుండా జెండాను ఆవిష్కరించడం మండలవాసులను విస్మయానికి గురిచేసింది. ఇది ఆయన్ని అవమానించడమేనని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News