ఏబీసీ అంటే అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్.. 10 సీట్లు గెలుస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమీషన్ల ప్రభుత్వం అని, తెలంగాణలో బీజేపీ 10 సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు

Update: 2024-05-05 12:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమీషన్ల ప్రభుత్వం అని, తెలంగాణలో బీజేపీ 10 సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు ఆయన హజరయ్యారు. అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పటికే ముగిసిన రెండు దశల పోలింగ్ ప్రకారం సెంచరీ కొడతామని, మూడో దశ పోలింగ్ సమయానికి 200 దాటుతాయని అన్నారు. ఇక తెలంగాణలో పోలింగ్ సమాయానికి బీజేపీ 250 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, తెలంగాణలో 10 సీట్లు గెలువడం ఖాయం అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని. దేశంలో ఎన్డీఏ, ఇండియా మాధ్య పోటీ జరుగుతోందని. ఈ పోటీలో ఒక వైపు మోడీ ఉన్నారు, మరోవైపు రాహుల్ ఉన్నారని పేర్కొన్నారు. మోడీ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పని చేస్తుంటే.. రాహుల్ సెలవులు రాగానే బ్యాంకాక్ లో సేద తీరుతారని ఆరోపించారు. సైనికులతో దీపావళి రోజున స్వీట్లు తినే వ్యక్తి మోడీ.. అయితే ఎండలకు తట్టుకోలేక బ్యాంకాక్ వెళ్లే వ్యక్తి రాహుల్ అని ఎద్దేవా చేశారు. అయోధ్యలో భవ్య మందిరం నిర్మించామని. మోడీ శ్రీరాముడ్ని ప్రజలకు దగ్గర చేశాడని.. దీని కోసం కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు కాలయాపన చేసిందని తెలిపారు. రామమందిరం ప్రారంభానికి ఖర్గే రాహుల్ లను ఆహ్వానించామని తమ ఓటు బ్యాంకు పోతుందని వారు రాలేదని తెలిపారు. ఖర్గే ఓటు బ్యాంకు ఓవైసీ ఓటు బ్యాంకు ఒక్కటేనని అన్నారు.

అంతేగాక ఓవైసీ ఓటు బ్యాంకే రాహుల్ బలమని, తెలంగాణలో ఏబీసీలు అంటే అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కొత్త అర్ధం చెప్పారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమీషన్ల ప్రభుత్వం అని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఆ రిజర్వేషన్లు ఇస్తామని తేల్చి చెప్పారు. నా ఫేక్ వీడియోలను తెలంగాణ సీఎం వైరల్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, నా వీడియోలు ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని దుయ్యబట్టారు. మూడోసారి మోడీ ప్రభుత్వం రాబోతోంది. ప్రజసేవ చేసే మోడీ కావాలా? రాహుల్ బాబా కావాలా? అని ప్రశ్నించారు. మోడీ గెలవాలంటే ఆదిలాబాద్ లో గోటం నగేష్ గెలవాలని అమిత్ షా అన్నారు. 

Similar News