మనోధైర్యాన్ని నింపేందుకే యాత్ర.. : Revanth Reddy

భారత్ జోడో యాత్ర జరిగి ఏడాది అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Update: 2023-09-07 13:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ జోడో యాత్ర జరిగి ఏడాది అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జోడో యాత్ర మొదలు పెట్టారన్నారు. వారికి సంఘీభావంగా దేశ ప్రజల మనోధైర్యాన్ని పెంచే విధంగా జోడో యాత్ర చేపట్టారన్నారు. ‘నఫ్రత్ చోడో భారత్ జోడో’ అనే సందేశాన్ని దేశప్రజలకు ఇచ్చారన్నారు. కోట్లాది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు అండగా నిలబడ్డదన్నారు. బీజేపీ వల్ల ప్రజలకు ముప్పు ఏర్పడిందన్నారు. దీనికి మణిపూర్ అల్లర్లు నిదర్శనమన్నారు. దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, వీహెచ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News