బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే?

జగిత్యాలలో ఓ మహిళ ఆర్టీసీ బస్సు టైర్ కింద టైర్ పెట్టింది.

Update: 2023-07-21 12:05 GMT

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాలలో ఓ మహిళ ఆర్టీసీ బస్సు టైర్ కింద టైర్ పెట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే.. మెట్ పల్లి నుంచి జగిత్యాలకు ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే ఈ క్రమంలోనే ఓ మహిళ అకస్మాత్తుగా బస్సు వెనుక టైర్ కు కొంత దూరంలో కిందపడింది. ఇంతలోనే బస్సు బయలుదేరింది. అయితే వెనుక బస్సు టైర్ ఆమె తల దగ్గరికి రాగానే గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు.  వెంటనే డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు.  ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. 

Tags:    

Similar News