2024-25 విద్యాసంవత్సరంలో స్కూళ్లకు 229 వర్కింగ్ డేస్

రాష్ట్రంలో 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం శనివారం ప్రకటించారు. మొత్తంగా పాఠశాలలకు 229 పనిదినాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Update: 2024-05-26 02:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం శనివారం ప్రకటించారు. మొత్తంగా పాఠశాలలకు 229 పనిదినాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాలలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ఈ విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డేగా పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు జనవరి 10 లోపు సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు సిలబస్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కాగా ఈ ఏడాది బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1 నుంచి 11 వరకు కొనసాగించాలని స్పష్టం చేశారు.

సెలవులు

దసరా అక్టోబర్ 2-14 వరకు (13 రోజులు)

క్రిస్మస్ డిసెంబర్ 23-27 వరకు (5 రోజులు)

సంక్రాంతి 2025 జనవరి 13-17 వరకు (5 రోజులు)

పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఫార్మేటివ్ అసెస్ మెంట్(ఎఫ్ఏ 1) జులై 31లోపు పూర్తి చేయాలి

ఫార్మేటివ్ అసెస్ మెంట్(ఎఫ్ఏ 2) సెప్టెంబర్ 30లోపు

సమ్మేటివ్ అసెస్ మెంట్(ఎస్ఏ 1) అక్టోబర్ 21-28 వరకు

ఫార్మేటివ్ అసెస్ మెంట్(ఎఫ్ఏ 3) డిసెంబర్ 17లోపు పూర్తిచేయాలి

ఫార్మేటివ్ అసెస్ మెంట్(ఎఫ్ఏ 4) జనవరి 29 లోపు. 1-9 తరగతులకు ఫిబ్రవరి 28లోపు

సమ్మేటివ్ అసెస్ మెంట్(ఎస్ఏ 2) ఏప్రిల్ 9-19 వరకు

టెన్త్ ప్రీ ఫైనల్ 2025 ఫిబ్రవరి 28లోపు

బోర్డ్ ఎగ్జామ్స్ 2025 మార్చిలో

Similar News