GRMB మీటింగ్‌కు తెలంగాణ డుమ్మా..

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి తెలంగాణకు చెందిన సభ్యులు హాజరుకాలేదు. బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే, కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు నారాయణరెడ్డి, సతీష్, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీలు శ్రీకాంత్, శ్రీధర్ దీనికి హాజరయ్యారు. కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై ఇందులో చర్చిస్తున్నట్లు సమాచారం. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ […]

Update: 2021-08-03 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి తెలంగాణకు చెందిన సభ్యులు హాజరుకాలేదు. బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే, కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు నారాయణరెడ్డి, సతీష్, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీలు శ్రీకాంత్, శ్రీధర్ దీనికి హాజరయ్యారు.

కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై ఇందులో చర్చిస్తున్నట్లు సమాచారం. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ముందుగా కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి బోర్డు భేటీ తర్వాతే సమన్వయ కమిటీ భేటీ జరగాలని కోరింది.

 

Tags:    

Similar News