HYD : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద చిరుత కోసం కొనసాగుతున్న రెస్క్యూ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోకి చొరబడిన చిరుత కోసం అటవీ అధికారుల ప్రయత్నం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-04-30 04:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోకి చొరబడిన చిరుత కోసం అటవీ అధికారుల ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం 6గంటల వరకు చిరుత సంచరించే ప్రాంతాన్ని దాని కదలికలను కనుగొనడం కోసం అత్యాధునికమైన 11 కెమెరాలు బిగించగా నేటి ఉదయం మరొక 9 కెమెరాలు అమర్చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాని అడుగు జాడలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి, చిరుత సంచరిస్తున్న ప్రదేశాలలో 2 ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. అయితే నిన్న ట్రాప్ కెమెరాకు చిరుత కదలికలు చిక్కాయి. మేకను ఎరగా వేసి చిరుతను అధికారులు ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోను దగ్గరకు వచ్చినట్టే వచ్చి చిరుత వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. షాద్ నగర్ నుంచి చిరుత వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత వయస్సు రెండేళ్లు ఉంటుందని అధికారులు ధృవీకరించారు.

Similar News