అక్షయ తృతీయ : మండుటెండలో బయటకు ఎందుకు.. ఇంట్లో ఉండే పది నిమిషాల్లో బంగారం కొనేయొచ్చు..

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు ఇంటికి కాసింత బంగారం తెచ్చుకున్నా.. ఇంట్లో లక్ష్మీ దేవి తాండవిస్తుందని నమ్ముతుంటారు.

Update: 2024-05-10 07:15 GMT

దిశ, ఫీచర్స్: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు ఇంటికి కాసింత బంగారం తెచ్చుకున్నా.. ఇంట్లో లక్ష్మీ దేవి తాండవిస్తుందని నమ్ముతుంటారు. అందుకే గోల్డ్ షాప్స్ అన్ని బిజీగా ఉంటుండగా.. బంపర్ ఆఫర్స్ కూడా ప్రకటిస్తుంటాయి. అయితే ఈ ఎండలో ప్రయాణం చేయడం, అలసిపోవడం ఎందుకని అనుకుంటే మాత్రం మీకో సొల్యూషన్ దొరికింది. పలు కంపెనీలు ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి.

జస్ట్ టెన్ మినిట్స్ లో మీ దగ్గరికి బంగారాన్ని చేర్చేందుకు ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పోటీపడుతున్నాయి. Blinkit, SwiggyInstamart, Zepto ఈ సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. సూపర్ క్విక్ గా గోల్డ్, సిల్వర్ డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్నాయి. ఇక ఈ విషయం ట్రెండ్ అవుతుండగా.. పది నిమిషాల్లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ను ఇస్తే బాగుంటుంది కానీ ఇలాంటి అవకాశం అస్సలు వద్దు అంటున్నారు. బంగారం విషయంలో అస్సలు నమ్మలేమని చెప్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News