అమెజాన్‌లో Realme స్మార్ట్ ఫోన్‌పై రూ. 4,000 తగ్గింపు

Realme కంపెనీ నుంచి ఇటీవల లాంచ్ అయిన Narzo N55 మోడల్‌పై ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో భారీ తగ్గింపు ఉంది

Update: 2023-04-21 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్:Realme కంపెనీ నుంచి ఇటీవల లాంచ్ అయిన Narzo N55 మోడల్‌పై ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో భారీ తగ్గింపు ఉంది. ఫోన్ లాంచ్ టైంలో 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 14,999 ఉండగా, ప్రస్తుతం 27 శాతం తగ్గింపుతో రూ.4,000 ఆఫర్ లభిస్తుంది. దీంతో స్మార్ట్ ఫోన్ రూ.10,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు కంపెనీ కొన్ని కూపన్ కోడ్‌లను అందిస్తుంది. కూపన్ కోడ్‌‌ల ద్వారా అదనంగా మరింత తగ్గింపు ఉంటుంది. ఎంపిక చేసిన Realme స్మార్ట్ ఫోన్‌లపై రూ.100 తగ్గింపును పొందవచ్చు. ఈ కోడ్‌లు ఏప్రిల్ 30, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


Realme Narzo N55 స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల IPS LCD ప్యానెల్‌తో పూర్తి HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. MediaTek Helio G88 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 64MP ప్రధాన కెమెరా, 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. హ్యాండ్‌సెట్ 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags:    

Similar News