NASA: బ్లాక్ హోల్స్ లోపల ఏముందో ఇప్పుడు చూడొచ్చు.. ఎలానో తెలుసా..?

అంతరిక్షంపై ఆశక్తి ఉన్నవాళ్లకి బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలం) గురించి వివరణ అవసరం లేదు.

Update: 2024-05-07 08:29 GMT

దిశ వెబ్ డెస్క్: అంతరిక్షంపై ఆశక్తి ఉన్నవాళ్లకి బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలం) గురించి వివరణ అవసరం లేదు. కృష్ణ బిలం అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ కలిగి ఉండే స్పేస్‌టైమ్ ప్రాంతం. అక్కడ ఎంత బలమైన గురుత్వాకర్షణ ఉంటుంది అంటే బ్లాక్ హోల్స్ ఆకర్షణ నుండి ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ తప్పించుకోలేదు.

అలాంటి బ్లాక్ హోల్స్ లోపల ఏముందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి ఉంటుంది. అదే కుతూహలంతో US స్పేస్ ఏజెన్సీ NASA బ్లాక్ హోల్స్ లోపల ఏముందో కళ్లకు కట్టినట్టు చూపేలా విజువలైజేషన్‌ను సృష్టించింది. ఇందులో బ్లాక్ హోల్‌లోకి ఒక స్నీక్ పీక్‌ను ఇస్తారు. కాగా ఈ సిమ్యులేషన్‌తో వీక్షకులు ఈవెంట్‌లోని సుదూర ప్రదేశంలోకి వెళ్తారు.

ఈ ప్రాజెక్ట్‌ను గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెరెమీ ష్నిట్‌మాన్ శాస్త్రవేత్త బ్రియాన్ పావెల్‌ నాయకత్వంలో నాసా రూపొందించింది. కాగా ప్రాజెక్ట్‌లో డిస్కవర్ సూపర్ కంప్యూటర్‌ని NASA ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇది మన పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్నటువంటి ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్.

అలానే ఇది మన సూర్యుడి కంటే 4.3 మిలియన్ రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఉంటుంది. కాగా బ్లాక్ హోల్స్‌లో ఏం ఉంటుందో చూడాలి అని అనుకునే వాళ్లకు నాసా ఈ ప్రాజెక్ట్‌ ద్వారా చూపిస్తోంది. ఈ 400 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్‌‌లో ఏం ఉంది అనేది కెమెరాలను ఉపయోగించి చూపిస్తారు. కాగా అత్యంత శబ్ధంతో కెమెరా దగ్గరవుతున్న కొద్దీ, నక్షత్రాల నుండి వచ్చే కాంతి మరియు బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న గ్యాస్ డిస్క్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 

Similar News