ఉగ్రరూపంలో సూర్యుడు.. ఎగిసి పడుతున్న మంటల GIF విడుదల చేసిన నాసా!

ఆకాశంలో అద్భుతం జరిగింది. సూర్యుడి నుంచి అతి పెద్ద సౌర జ్వాల ఎగిసిపడింది. సూర్యుడి నుంచి మంటలు వస్తున్న GIFను నాసా తాజాగా విడుదల చేసింది మే 7,8 తేదీల్లో ఈ తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్లు తెలిపింది.

Update: 2024-05-10 08:27 GMT

దిశ, ఫీచర్స్ : ఆకాశంలో అద్భుతం జరిగింది. సూర్యుడి నుంచి అతి పెద్ద సౌర జ్వాల ఎగిసిపడింది. సూర్యుడి నుంచి మంటలు వస్తున్న GIFను నాసా తాజాగా విడుదల చేసింది మే 7,8 తేదీల్లో ఈ తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్లు తెలిపింది. ఇక వీటిని ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ అంటారని, ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని పేర్కొంది. అలాగే ఈ సౌర జ్వాల నుంచి వెలువడే బలమైన ఎక్స్​- కిరణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి తక్కువ తీవ్రత గల రేడియో సిగ్నల్స్​ను దెబ్బతీస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమి వైపుగా వచ్చినప్పుడు ఉపగ్రహాలు, జీపీఎస్, రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతుందంట. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక ఇలాంటి ఘటనలు ముందు ముందు కూడా రావచ్చునంట. ఇక ఈ సౌర మంటలు అనేవి సూర్యుని ఉపరితలం నుంచి రేడియేషన్ కు సంబంధించిన శక్తి వంతమైన పేలుళ్లు. సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు మెలితిప్పడం వలన ఈ పేలుళ్లు, మంటలు వస్తుంటాయంట. అలాగే సూర్యునిలోని ప్లాస్మా వేగం, అది కదిలే దిశల వలన ఇలాంటి ఘటనలు సంభవిస్తుంటాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News