iPhone 15 :ఆకట్టుకునే డిజైన్‌తో ఈ ఏడాది చివరిలోపు ఐఫోన్ 15

ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఈ ఏడాది చివరిలోపు ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Update: 2023-02-15 10:30 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఈ ఏడాది చివరిలోపు ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ఈ సిరీస్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ సన్నగా, ఎడ్జ్‌లు ఆకట్టుకునే డిజైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, కెమెరాల పరంగా పాత మోడల్స్‌తో పోల్చుకుంటే 48-మెగాపిక్సెల్ వెడల్పు కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంకా, బేస్ మోడల్స్‌లో A16 బయోనిక్ చిప్‌‌ను ఉపయోగించనున్నారు. అదే ప్రో మోడల్స్‌ A17 బయోనిక్ SoC ద్వారా శక్తిని పొందుతాయి.


ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐఫోన్ 15 సిరీస్‌ స్మార్ట్ ఫోన్లు USB టైప్-సి పోర్ట్‌తో వస్తున్నట్లు సమాచారం. కొత్త ఫోన్లలో డిస్‌ప్లే సైజ్ ఐఫోన్ 14 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. త్వరలో ఐఫోన్ 15 కు సంబంధించిన ఫీచర్స్, ధరలు, లాంచ్ తేదీ తదితర వివరాలను కంపెనీ పేర్కొననుంది.




Tags:    

Similar News