స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. మీ కోసమే ఈ గుడ్ న్యూస్

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీకోసమే ఈ తీపి కబురు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే అది నేటితో ముగియనుడటంతో, స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది.

Update: 2024-01-19 09:23 GMT

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీకోసమే ఈ తీపి కబురు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే అది నేటితో ముగియనుడటంతో, స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది.

రియల్ మీ, షావోమి , వన్ ప్లస్, సామ్సంగ్, ఆపిల్, ఐ క్యు , హానర్ , మోటోరోలా, పోకో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా గరిష్టంగా రూ .5000 వరకు రివార్డులను పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్లో కొన్ని బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మీరు నచ్చిన మొబైల్ ని కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11R 5G: 6.7 అంగుళాల 120Hz రిఫ్రెష్ రేటుతో సూపర్ ఫ్లూయిడ్ అమౌల్డ్ డిస్ప్లే తో పవర్ ఫుల్ విజువల్స్ ను అందిస్తుంది. స్నాప్ డ్రాగన్ 8+జెన్ 1 ప్రాసెసర్ తో పనిచేస్తుంది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ పై రన్ అవుతుంది. రూ.39,999 వద్ద ఈ స్మార్ట్ ఫోన్ రిటైల్ ధరకు లభిస్తూ ఉండగా ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ లావాదేవీ పై రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Motorola Razr 40 Ultra: ఈ స్మార్ట్ ఫోన్ రూ.69,999 ధర వద్ద లభిస్తుంది. 6.9 అంగుళాల డిస్ప్లే తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ 32 మెగా పిక్సెల్ ఎక్స్టర్నల్ డిస్ప్లే లో 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాని అమర్చారు. ఇక వీటితోపాటు ఆపిల్ ఐఫోన్ 13, ఐక్యూ 12 5G ఫోన్లపై కూడా ఆఫర్ లభిస్తోంది.

Tags:    

Similar News