వలంటీర్లను నియమించింది వంగివంగి దండాలు పెట్టడానికా?: బాబు

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది వంగివంగి దండాలు పెట్టించుకోవడానికా? అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక విజయనగరం జిల్లాలో వలంటీర్ ఆత్మహత్యాయత్నం చేయడంపై ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన… ‘ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే అని చెప్పి వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే 1,000 రూపాయలను వైఎస్సార్సీపీ నేతలు […]

Update: 2020-04-25 08:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది వంగివంగి దండాలు పెట్టించుకోవడానికా? అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక విజయనగరం జిల్లాలో వలంటీర్ ఆత్మహత్యాయత్నం చేయడంపై ట్విట్టర్ మాధ్యమంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన… ‘ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే అని చెప్పి వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే 1,000 రూపాయలను వైఎస్సార్సీపీ నేతలు ఇస్తామనడం ఏంటి? కాదన్న వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఏంటి? వాళ్ళున్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా?. విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైఎస్సార్సీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారు. ఝాన్సీ ఆత్మహత్యా యత్నం చేసింది. ఏమిటీ వేధింపులు? ప్రజల డబ్బుతో వాలంటీర్లను నియమించింది వైఎస్సార్సీపీ నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా?’అని బాబు నిలదీశారు.

Tags: tdp, ysrcp, chandrababu naidu, twitter, ap

Tags:    

Similar News