కులమతాల పేరుతో మా మధ్యే చిచ్చు పెడ్తారా?

దిశ. కరీంనగర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారనే కారణంతో ప్రొఫెసర్ సుజాతపై పోలీసులు కేసు నమోదు చేసి, సరిగ్గా 24 గంటలు గడువక ముందే ఆమెకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పరిరక్షణ సమితి పేరిట ఈ పోస్టులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే శాతవాహన యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సూరపల్లి సుజాత కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో ఆమెపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. […]

Update: 2020-04-03 07:06 GMT

దిశ. కరీంనగర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారనే కారణంతో ప్రొఫెసర్ సుజాతపై పోలీసులు కేసు నమోదు చేసి, సరిగ్గా 24 గంటలు గడువక ముందే ఆమెకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పరిరక్షణ సమితి పేరిట ఈ పోస్టులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే శాతవాహన యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సూరపల్లి సుజాత కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో ఆమెపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, మాకు మంచి పాఠాలు చెప్పాల్సింది పోయి మమ్మల్ని కులమతాల పేరిట విడగొట్టాలని చూస్తావా అంటూ నెటిజన్లు విరుచుక పడ్డారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం నీకు తగునా అన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా శాతవాహన యూనివర్సిటీ‌లో తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) యూనియన్ నాయకులు, మావోయిస్టులతో సంబంధాలు కలిగిన వ్యక్తులతో కలిసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపణలు చేశారు.ప్రభుత్వం స్పందించి కేసుతో ఆగకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని తెలంగాణ పరిరక్షణ సమితి కోరింది.

Tags : prof sujatha, social media, students fire on prof, corona, lockdown

Tags:    

Similar News