మాకు సౌలతులు లేవు.. ఎవ్వరికి ఓటు వెయ్యం… డబుల్ లబ్ధిదారుల ఆందోళన

మాకు ఇళ్లు ఇచ్చారు కానీ ఉండడానికి కనీస వసతులు కల్పించలేదు.

Update: 2024-04-29 11:27 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: మాకు ఇళ్లు ఇచ్చారు కానీ ఉండడానికి కనీస వసతులు కల్పించలేదు. సౌకర్యాలు లేని ఇండ్లలో ఎలా ఉండాలి.. అంటూ జగిత్యాల అర్బన్ కాలనీలోని నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.మాకు న్యాయం చేస్తారనే ఇంతకముందు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే ఎవరు చేయలేదని కాబట్టే ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్లు వేయమని తేల్చి చెప్పారు. నాలుగు వేల మంది డబుల్ ఇళ్లలో ఉంటున్నామని మౌలిక సదుపాయాలు వారం రోజుల్లో ఎవరు కల్పిస్తే వాళ్ళకే ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తామని అన్నారు.

కనీస అవసరాలైన కరెంట్, మంచి నీటి సౌకర్యం కూడా ఎవరు కల్పించలేదని డ్రైనేజీలు ఎక్కడికక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యకు పరిష్కారం చూపకపోతే అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కాళ్లు మొక్కుతున్న ఎవరు తమను కేర్ చెయ్యట్లేదని ఎవరు న్యాయం చేయకపోతే అవసరమైతే ఇండ్ల కోసం అడుక్కొని అయినా మా సౌకర్యాలు మేము కల్పించుకుంటాం అన్నారు.

Similar News