జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం..స్తంభించిన రవాణా
వాతావరణ పరిస్థితులకు భారీ వృక్షం నేలకొరిగిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది.
దిశ, మేడిపల్లి: వాతావరణ పరిస్థితులకు భారీ వృక్షం నేలకొరిగిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జాతీయ రహదారి ప్రక్కన గల రావి చెట్టు భారీ వృక్షం నేలకొరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడినుండి ప్రయాణిస్తున్న మంచిర్యాల నుండి నిర్మల్‌కు వెళుతున్న డీసీఎం, బోధన్ నుండి జగిత్యాలకు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. వాహన దారులు అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పి ఎవరికి అపాయం జరగలేదు. వృక్షం నేలకొరగడం తో జాతీయ రహదారిపై మూడు గంటలు పాటు రవాణా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రోడ్డుపై కూలిన వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.