అండర్-19 ప్రపంచ కప్ కెప్టెన్‌గా షఫాలీవర్మ

త్వరలో అండర్-19 మహిళల వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది.

Update: 2022-12-05 15:11 GMT

న్యూఢిల్లీ: త్వరలో అండర్-19 మహిళల వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. భారత మహిళ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మను వరల్డ్ కప్ జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. దీంతో పాటు దక్షిణాఫ్రికాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు కూడా నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఐసీసీ టోర్నీతో పాటు దక్షిణాఫ్రికాతో ఆడనున్న బృందాలను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. జనవరి 14-29 వరకు జరిగే అండర్-19 వరల్డ్‌కప్‌లో 16 జట్లు బరిలోకి దిగనున్నాయి. గ్రూప్‌-డీలో భారత్.. దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్‌తో పోటి పడనుంది. ఒక్కో గ్రూపు నుంచి టాప్-3లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ రౌండ్లోకి ప్రవేశిస్తాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లు జనవరి 27న జరగనుండగా, ఫైనల్ 29న జరగనుంది.

అండర్-19 ప్రపంచ కప్ మహిళల జట్టు:

షఫాలీ వర్మ(కెప్టెన్), శ్వేతా సెహ్రవత్(వైస్ కెప్టెన్), రిచా ఘోష్, త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లే గలా, హృషిత బస్(కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవీ, పర్షవి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నామ్

స్టాండ్ బైల్ ప్లేయర్లు: షిఖా, నాజ్ల, యషశ్రీ

Similar News